Header Banner

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. నలుగురు సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్!

  Sat May 31, 2025 13:40        Health

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండగా, ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌లోని ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఈరోజు ఉద‌యం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?

 

కాగా, నాలుగు రోజుల క్రితం ఏలూరు నగరంలోని శాంతినగర్‌కు చెందిన ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

 

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Covid-19 #Eluru #StaffTestPositive #AndhraPradesh #APnews